in

Sai pallavi angry with fans taking photos without permission!

తెలుగులో నాగచైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీ విడుదల కానుంది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి తన విషయంలో అభిమానులు చూపించే ఉత్సాహంపై కాస్త కోపం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరిలోనూ వారికి నచ్చే అంశాలు నచ్చని అంశాలు కూడా ఉంటాయి అలాగే కొన్ని భయాలు కూడా వెంటాడుతూ ఉంటాయని తెలిపారు..

నేను ఏదైనా బయటకు వెళ్తే కొంతమంది టక్కున వారి ఫోన్ బయటకు తీసి ఫోటోలు తీస్తూ ఉంటారు. అలా ఫోటోలు తీస్తే కనుక నాకు చాలా కోపం వస్తుంది. నేను కూడా మనిషినే కదా అని సాయి పల్లవి తెలిపారు. ఆ సమయంలో నేను ఒక చెట్టునో, అందమైన భవనాన్నో కాదు కదా ఒక జీవం ఉన్న మనిషిని కదా అనిపిస్తుంది. అలా వారి ఇష్టానుసారంగా ఫోటోలు తీయకుండా దగ్గరికి వచ్చి మీతో ఒక ఫోటో తీసుకోవచ్చా అని అడిగితే ఎంత బాగుంటుంది. ఇక తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ తనని గమనిస్తూ ఉన్నప్పుడు నాకు కాస్త భయం వేస్తుందని సాయి పల్లవి తెలిపారు..!!

Rajamouli Begins Shooting with Mahesh Babu and John Abraham?

Viral Girl Maha Kumbh Monalisa Cast in Ram Charan Film!