తెలుగు యూత్ గుండెల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ. ఎవ్వరు ఊహించని రోల్ చేసి తొలి సినిమాతోనే ఆకట్టుకుంది. ఆమె అందాలు, నటన, స్క్రీన్ ప్రెజెన్స్ అందరి దృష్టిని ఎంతగానో ఆకర్షించింది. పాయల్ కు ఈ సినిమా, ఎంతో పాపులారిటీ తెచ్చింది. తర్వాత, “మంగళవారం” చిత్రంతో మరింత క్రేజ్ సంపాదించింది.
తెలుగు సినీ పరిశ్రమలో, యువతకు హాట్ ఫేవరెట్‌గా మారిపోయింది. ముఖ్యంగా మంగళవారం సినిమాలో పాయల్ చేసిన రోల్ అందరినీ ఆశ్చర్యపరిచింది..కాగా మంగళవారం చిత్రం పాన్ ఇండియా చిత్రంగా వచ్చి మంచి విజయం అందుకుంది.ఈ క్రమంలో పాయల్ రాజ్‌పుత్ మరో పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం “ప్రొడక్షన్ నం. 1” అనే పేరుతో రూపొందుతుంది. పాయల్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ఈ చిత్రానికి ముని దర్శకత్వం వహిస్తున్నారు..!!