సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్ట్ పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం పై సుప్రీం కోర్టులో మోహన్ బాబుకు స్వల్ప ఊరట లభించింది. తదుపరి విచారణ వరకు మోహన్ బాబు పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాలకు కేసు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.
ఇంట్లోకి వచ్చినంత మాత్రాన జర్నలిస్టుపై దాడి చేస్తారా..? అని ప్రశ్నించిన సుప్రీంకోర్టు ధర్మాసనం. నష్టపరిహారం కావాలా..? జైలుకు పంపాలా అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ప్రతివాదులు దాఖలు చేసే కౌంటర్లో అన్ని విషయాలు స్పష్టం చేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణలో జడ్జిమెంట్ ఇస్తామని స్పష్టం చేసింది ధర్మాసనం.సినీ నటుడు మోహన్ బాబు తరఫున వాదన వినిపించారు సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గి. తన కొడుకుతో గొడవల సందర్భంగా ఈ ఘటన జరిగింది..!!