ప్రముఖ యాంకర్, నటి, బుల్లితెర రాములమ్మగా పేరు సొంతం చేసుకున్న శ్రీముఖి వివాదాల్లో చిక్కుకుంది. విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని శ్రీముఖి హోస్ట్ చేసింది. ఈ మూవీని అగ్ర నిర్మాత దిల్ రాజు, ఆయన సోదరుడు శిరీష్ నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని శ్రీరామచంద్రుడు, లక్ష్మణుల మధ్య అనుబంధంతో కంపేర్ చేయబోయి.. హడావిడిలో తడబడింది శ్రీముఖి.
రామలక్ష్మణులు ఫిక్షనల్ అని, దిల్ రాజు, శిరీష్ నిజమని నోరు జారింది. హిందూ సమాజం దేవుడిగా భావించే రాముడిని ఆయన సోదరుడు లక్ష్మణుడిని కల్పిత పాత్రలుగా శ్రీముఖి పేర్కొనడంతో సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ చేశారు హిందుత్వ వాదులు. తక్షణమే క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఓ వీడియోని షేర్ చేసింది శ్రీముఖి. రామలక్ష్మణుల గురించి తాను పొరపాటుగా మాట్లాడానని ఆవేదన వ్యక్తం చేసింది..!!