రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్ రాజా సాబ్ మూవీ గూర్చి పలు విషయాలు చెప్పాడు. రాజాసాబ్ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ ని జపాన్లో చేయనున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలో జపనీస్ వెర్షన్ లో ఓ సాంగ్ చేయమని తనని మూవీ యూనిట్ కోరిందని కూడా తెలిపాడు. ఈ మధ్య తెలుగు సినిమాల ట్రైలర్ రిలీజ్ ఈవెంట్స్, కొన్ని ముఖ్యమైన ఈవెంట్స్ ని ఫారెన్ కంట్రీస్ లో చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజా సాబ్ మూవీ యూనిట్ జపాన్ లో ఆడియో లాంచ్ చేయాలనుకుంటోంది. ప్రభాస్ కి జపాన్ లో ఎక్కువమంది ఫాన్స్ ఉన్నారు. కల్కి జపాన్ వెర్షన్ జనవరి 3 న జపాన్ లో రిలీజ్ చేసారు. ఈ రిలీజ్ కోసం ప్రభాస్ వెళ్లాల్సి ఉండగా మిస్ అయింది..!!