in

Meenakshi Chaudhary having a wonderful 2025!

తెలుగు తెరపైకి శ్రీలీల, కృతి శెట్టి ఇద్దరూ కూడా రాకెట్ స్పీడ్ తో దూసుకుని వచ్చారు. ఆరంభంలో హిట్లు కొట్టిన ఈ భామలు ఇద్దరూ కూడా ఇప్పుడు ఫ్లాపులతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా చిన్న సినిమాతో తన కెరియర్ ను మొదలుపెట్టిన మీనాక్షి చౌదరి, నిదానంగా కుదురుకుంటూ ఉండటం ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పెద్ద హీరోల జోడీగా అవకాశాలు అందుకుంటూ వెళుతుండటం విశేషం. ‘గుంటూరు కారం’ సినిమాలో మీనాక్షి చౌదరి పాత్ర నామమాత్రంగానే కనిపిస్తుంది..

కానీ గ్లామర్ పరంగా ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది ఈ సినిమాతోనే. ఇక ఇటీవల వచ్చిన ‘లక్కీ భాస్కర్’ సినిమా హిట్ కావడం కూడా ఆమె కెరియర్ కి హెల్ప్ అయింది. ఈ సినిమాను ఆడియన్స్ ఇంకా మరిచిపోకముందే, వెంకటేశ్ సరసన చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా, ఈ పండుగకి థియేటర్లలో దిగిపోనుంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా పాటలు ఇప్పటికే జనంలోకి దూసుకుని వెళ్లాయి. అటు మాస్ ను..ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి..!!

Keerthy Suresh thanks Samantha For Recommending Her name!

Harish Shankar Confirms Aavesham Remake with Balakrishna!