చిరంజీవి, మోహన్ లాల్ మంచి జాన్ జిగురు దోస్తులు. అన్ని భాషల్లోనూ నటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మోహన్ లాల్ ఇప్పుడు చిరుని డైరక్ట్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. బరోజ్ తో మెగా ఫోన్ పట్టిన మోహన్ లాల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవితో కలిసి వర్క్ చేయాలి అనుకుంటున్నట్లు తెలిపారు..
అది కూడా హీరోలుగా కలిసి వర్క్ చేయటం కాదు మోహన్ లాల్ దర్శకుడిగా, చిరు హీరో గా సినిమా తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు బయట పెట్టారు. తెలుగు హీరోల్లో ఎవర్ని డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు అని ప్రశ్న ఎదురవగా టక్కున చిరంజీవి అని చెప్పారు మోహన్ లాల్. వీరిద్దరూ మంచి స్నేహితులని, హైదరాబాద్ కి ఎప్పుడు వచ్చినా ఇద్దరు ఒకర్ని ఒకరు కలవకుండా ఉండరని తెలిపారు. అలాంటిది తెలుగులో సినిమా తీయాలనుకుంటే చిరుకి కాక ఇంకెవరికి కాల్ చేస్తానని ఎదురు ప్రశ్నించారు మోహన్ లాల్..!!