రష్మిక విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉన్నారు అంటూ గత కొంతకాలంగా వీరి ప్రేమ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక ఈ విషయాన్ని కూడా వీరిద్దరూ దాదాపు ఒప్పుకున్నారని చెప్పాలి. ఇకపోతే ఇటీవల పుష్ప 2 సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె విజయ్ దేవరకొండతో కలిసి మరోసారి కనిపించడంతో వీరి గురించి సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ఇస్తున్నటువంటి పార్టీ కోసం విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరు కలిసి ఒకే ఫ్లైట్ లో వెళ్లారని తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో వీరిద్దరూ ఒకరి తర్వాత మరొకరు కనిపించే సందడి చేశారు అదేవిధంగా విజయ్ దేవరకొండ తిరిగి రష్మిక వద్ద ఉన్నటువంటి క్యాప్ పెట్టుకొని కనిపించడంతో వీరిద్దరూ కలిసే ముంబై వెళ్లారని తెలుస్తుంది..!!