బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల తరువాత రాజమౌళి నుండి నెక్ట్స్ వచ్చే సినిమాలు ఏకంగా హాలీవుడ్ రేంజ్లో ఉంటాయని ఆల్రెడీ అంతా ఫిక్స్ అయ్యారు. ఇక మహేష్ బాబుతో ఆయన తీయబోయే సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం 100 ఎకరాల్లో వంద కోట్ల ఖర్చుతో అడవి సెట్‌తో రాజమౌళి ట్రెండ్ సెట్ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటో తెలుసుకుందాం.
మహేష్ బాబు సినిమా కోసం వంద కోట్లు ఖర్చు పెట్టి వంద ఎకరాల్లో ప్లాస్టిక్ అడవినే క్రియేట్ చేయబోతున్నాడు రాజమౌళి. వంద కోట్ల బడ్జెట్‌ని కేవలం మహేష్ బాబు సినిమాలో ఒక 20 నిమిషాల ఎపిసోడ్ కోసమే వాడబోతున్నాడు. అది కూడా కేవలం ఓ యాక్షన్ ఎపిసోడ్ కోసం వేసే సెట్ అని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ సినిమాలో విలన్ ఎవరనే చర్చ జరుగుతోంది. హాలీవుడ్ సూపర్ హీరో థోర్ ఫేం ని మహేష్ బాబు సినిమాలో తీసుకుంటున్నాడు రాజమౌళి. దీని కోసం భారీ సెట్ క్రియేట్ చేస్తున్నారని సమాచారం..!!