in

Samantha Lost Interest In south Movies?

మంత చాలా రోజులుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఖుషీ సినిమాకు ముందు దాదాపు ఏడాదికి పైగా బ్రేక్ తీసుకుంది. ఇక ఆ సినిమా తర్వాత ఒక ఏడాది గ్యాప్ తీసుకుంటానని చెప్పింది. కానీ ఆ మూవీ వచ్చి ఏడాదికంటే ఎక్కువ అవుతోంది. కానీ ఇంకా సమంత నుంచి సాలీడ్ సినిమా మాత్రం రాలేదు. మొన్న సిటాడెల్ సిరీస్ మాత్రమే చేసింది. ఇక దానికి ఎక్కడ లేని ప్రమోషన్లు చేసింది. ఇంకా చెప్పాలంటే ఆమె గతంలో ఏ సినిమాకు కూడా ఇంతగా ప్రమోషన్లు చేయలేదు. దీంతో ఆమె మళ్లీ సౌత్ లో సినిమాలు చేస్తుందేమో అని అంతా ఆశించారు..

గతంలో ఆమె మలయాళంలో ఓ సినిమాను ప్రకటించింది. కానీ అది ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. ఇక తన సొంత బ్యానర్ లో సినిమాను ప్రకటించి ఏడాది దాటుతున్నా దానిపై అప్ డేట్ లేదు. ఏ తెలుగు హీరో సినిమాను కూడా ఆమె ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అలా అని తమిళ హీరో సినిమాలను కూడా ప్రకటించలేదు. ఇంతలోనే ఆమె మరో ఓటీటీ సంస్థలో మరో వెబ్ సిరీస్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. దీన్ని చూస్తుంటే ఆమె ఇప్పట్లో సౌత్ లో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ గా లేదని తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే వెబ్ సిరీస్ లు బెటర్ అనుకుంటుందేమో..!!

WHO KNOWS, HOW AND WHEN LUCK HUGS!!

happy birthday jayasudha!