శ్రీలీల కెరీర్ మళ్లీ గాడిన పడుతున్నట్టు కనిపిస్తోంది. ఒక్కసారిగా తుఫాన్ లా వరుసగా సినిమాలు చేసేసింది. అయినా సరే పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకంటే అవేమీ ఆమె కెరీర్ కు తోడ్పడలేదు. ఎక్కువగా ప్లాపులే రావడంతో ఆమె కెరీర్ డైలమాలో పడిపోయింది. ఈ క్రమంలోనే పుష్ప-2లో చేసిన ఐటెం సాంగ్ లో భారీ క్రేజ్ వచ్చేసింది. దాంతో మళ్లీ ఆమెకు వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. అయితే ఈ సారి ఆమె అక్కినేని కాంపౌండ్ లోకి అడుగు పెడుతోంది. ప్రస్తుతం అక్కినేని వారింట వరుసగా శుభకార్యాలు జరుగుతున్నాయి. ఇప్పటికే నాగచైతన్య పెళ్లి అయిపోయింది..
త్వరలోనే అఖిల్ పెళ్లి ఉండబోతోంది. ఇక అఖిల్ ప్రస్తుతం ఓ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. వినరో భాగ్యము విష్ణుకథ డైరెక్టర్ తో ఓ కథ ఓకే అయింది. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా శ్రీలీలను తీసుకుంటున్నారంట. త్వరలోనే అన్నీ ఓకే చేసుకుని అధికారికంగా ప్రకటించబోతున్నారు. అయితే దీని తర్వాత కూడా అక్కినేని నాగచైతన్యతో శ్రీలీల నటించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం నాగచైతన్య విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండుతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను తీసుకుంటున్నారంట. రెండు పెద్ద ప్రాజెక్టులే..!!