రామాయణ సినిమా పూర్తయ్యేవరకు సాయి పల్లవి మాంసాహారం మానేశారని..హోటల్స్ లో కూడా తినడం లేదని కోలీవుడ్ లోని ఓ ప్రముఖ మీడియా సంస్థ వార్తలు రాసింది. సాయి పల్లవి విదేశాలకు వెళ్లేటప్పుడు కూడా వంట వాళ్లను వెంట తీసుకెళ్తుందని ప్రచారం చేసింది. దీనిపై స్పందించిన సాయిపల్లవి గట్టిగానే సమాధానం ఇచ్చింది. తనపై చాలాసార్లు రూమర్స్ వచ్చాయి..వస్తున్నాయి. కానీ నేను ప్రతి సారి మౌనంగానే ఉన్నానని చెప్పారు..
ఎందుకుంటే నిజం ఏంటనేది దేవుడికి తెలుసు. కానీ ఇలా మౌనంగా ఉంటున్నానని రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారు. ఇప్పుడు వాటిపై స్పందించాల్సిన సమయం వచ్చిందన్నారు. తన సినిమాల రిలీజ్ లు, ప్రకటనలు, కెరీర్ ఇలా తనకు సంబంధించి ఏదైనా నిరాధారమైన వార్తలు రాస్తే..చట్టబద్దమైన యాక్షన్ తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. ఇన్నాళ్లు సహించాను..ఇకపై ఇలాంటి చెత్త వార్తలను మోసుకెళ్లడానికి తాను సిద్ధంగా లేనని ఆమె అన్నారు. దీనికి సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది..!!