తాజాగా పార్ట్ 3 టైటిల్ కూడా రివీల్ చేసారు మేకర్స్. పుష్ప 2 కి సౌండ్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తున్న ఆస్కార్ విన్నర్ రసూల్ పూకుట్టి, తనటీమ్ తో ఉన్న ఫొటోని ఎక్స్ లో షేర్ చేసారు. బ్యాక్ గ్రౌండ్ లో స్క్రీన్ మీద ”పుష్ప 3: ది ర్యాంపేజ్” అనే టైటిల్ ఉంది. దీనితో పార్ట్ 3 కి ‘పుష్ప ది ర్యాంపేజ్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ టైటిల్ గతంలోనే రౌడీ హీరో విజయ్ దేవరకొండ రివీల్ చేసారు.
సుకుమార్ కు విజయ్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ‘2021 – ది రైజ్, 2022 – ది రూల్, 2023 – ది ర్యాంపేజ్’ అంటూ ట్వీట్ చేసాడు. ఈ క్రమంలోనే పుష్ప పార్ట్ 3 లో విజయ్ దేవరకొండ విలన్ గా నటిస్తున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. అందుకే సుకుమార్ విజయ్ కి ఆ టైటిల్ గూర్చి చెప్పి ఉంటారని, విజయ్ ముందే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హింట్ ఇచ్చాడని అంటున్నారు. నిజంగా అదే నిజమైతే అల్లు అర్జున్ కి విలన్ గా విజయ్ దేవరకొండ నటిస్తే మూవీ క్రేజ్ మరింత పెరుగుతుంది..!!