in

national crush Rashmika’s December Sentiment Effect!

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొత్తగా సినీ ఇండస్ట్రీలోకి ఎంతమంది హీరోయిన్లు వచ్చినా వారికి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే రష్మికకు డిసెంబర్ నెల బాగా కలిసొస్తుందంట. ఈ నెలలో విడుదలైన రష్మిక చాలా సినిమాలు విజయవంతం కావడంతో తాజాగా ఈనెల 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న పుష్ఫ2కు ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు.

ఈ సినిమా విడుదలను పురస్కరించుకొని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక..పుష్ప మూవీ విశేషాలు, షూటింగ్ అనుభవాలు పంచుకున్నారు. అలాగే డిసెంబర్ అంటే తనకు చాలా సెంటిమెంట్ అని, తన లక్కీ మంత్ అని చెప్పుకొచ్చారు. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. రష్మిక హీరోయిన్‌గా నటించిన తొలి సినిమా కిరాక్ పార్టీ డిసెంబర్ నెలలోనే విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది..!!

f cube ‘kriti shetty’!

Nandamuri Mokshagna Second Film with lucky bhaskar Director?