in

Arjun Kapoor confirms breakup with beauty Malaika Arora!

ర్జున్ కంటే 12 ఏళ్లు పెద్దదైన మలైకా..అతడితో సహజీవనం చేయడం ఏంటో ఎవ్వరికీ అర్థం కాలేదు. వీళ్లిద్దరి బంధం మీద చాలా విమర్శలు వచ్చినా ఆ జంట పట్టించుకోలేదు. ఇద్దరూ కలిసి ఓ ఇల్లు కొనుక్కుని అందులో కలిసి ఉన్నారు. మొదట్లో తమ బంధాన్ని దాచడానికి ప్రయత్నించిన ఈ జంట.. తర్వాత ఓపెన్ అయిపోయింది. చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. కొన్నేళ్ల రిలేషన్‌షిప్ తర్వాత వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ మధ్యలో ఏమైందో ఏమో..ఇద్దరి మధ్య దూరం పెరిగింది..

వీళ్లిద్దరూ విడిపోతున్నట్లు, విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఈ మధ్య అయితే ఇద్దరూ కలిసి కనిపించడం లేదు. మరి అర్జున్, మలైకా నిజంగా విడిపోయారా లేదా అనే విషయంలో స్పష్టత లేకపోయింది. ఇప్పుడు అర్జున్ దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు. మలైకా నుంచి విడిపోయినట్లు చెప్పకనే చెప్పేశాడు. తాజాగా ఓ కార్యక్రమం సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి..మీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారా అని అడగ్గా.. “లేదు. నేను సింగిల్‌గా ఉన్నా. అంతే కాదు చాలా సంతోషంగా కూడా ఉన్నా” అని అర్జున్ బదులిచ్చాడు..!!

KA!