in

RAJANI— THE MAN OF SIMPLICITY!

వి రజని,మామూటీ,అరవింద స్వామి కలసి నటించిన ” దళపతి” సినిమా షూటింగ్ జరుగుతున్న రోజులు.నిర్విరామంగా జరుగుతున్న షూటింగ్ లో అలసి పోయిన “బౌర్నవిటా బాయ్” అరవింద స్వామి గెస్ట్ హౌస్ కి వెళ్లి ఒక రూమ్ తలుపు తీశారు , లోపల ఏ.సి. నడుస్తుంది, చక్కగా అమర్చిన బెడ్ చూడగానే నిద్ర ముంచుకొని వచ్చింది వెళ్లి హాయిగా బెడ్ ఎక్కేసారు అరవింద స్వామి, హాయిగా ఆదమరచి నిద్రలోకి జారుకున్నారు. తెల్లవారాక మేలుకున్న అరవింద స్వామి తన బెడ్ ప్రక్కనే కింద దుప్పటి పరుచుకొని నిద్ర పోతున్న ఒక వ్యక్తి కనిపించాడు. ఎవరబ్బా? ఇతను అనుకుంటూ లేచి, బద్హకం గ వళ్ళు విరుచుకుంటూ, కొంచెం ముందుకు వచ్చి ఆ వ్యక్తి ని దగ్గరగా చూసారు, అంతే దెబ్బకు నిద్రమత్తు వదిలి, బయటకు పరుగెత్తాడు.

కింద నిద్ర పోతున్న వ్యక్తి ఎవరో ఊహించారా? రజనీకాంత్ గారు, బయటకు వెళ్లి కంగారుగా ప్రొడక్షన్ వాళ్ళను అడిగారట అరవింద స్వామి, అదేమిటి రజని సర్ నా రూమ్ లో కింద పడుకున్నారు అని.,దానికి ప్రొడక్షన్ వాళ్లు ఇచ్చిన సమాధానం ఏమిటంటే, అది మీ రూమ్ కాదు రజని గారిది, షూటింగ్ నుంచి లేట్ గ వచ్చిన రజని, మీరు నిద్రపోతుండటం చూసి, డిస్టర్బ్ చేయద్దు అని మమ్మల్ని వారించి, కింద పడుకొని నిద్రపోయారు అని విషయం చెప్పగానే, అరవింద స్వామి నోరెళ్లబెట్టారట. ఆకలి విలువ,నిద్ర విలువ తెలిసిన రజని, చిన్న పిల్లవాడి లాగ ఆదమరచి నిద్ర పోతున్న అరవింద స్వామిని డిస్టర్బ్ చేయకుండా తాను కింద పడుకొని నిద్రపోయారు. రజని సింపుల్సిటీ గురించి మనం ఎన్నో విషయాలు వింటూ ఉంటాము, అటువంటి అరుదయిన సంఘటన ఇది..!!

jhanvi kapoor wins telugu hearts!

house Robbery in mohan babu residence!