కోడి రామ్మూర్తి నాయుడు పాత్రలో రామ్చరణ్
రామ్ చరణ్ – బుచ్చిబాబు ఈ కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ కథ కోసం కోడి రామ్మూర్తి నాయుడు అనే ఓ మల్ల యోధుడి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొన్నారని తెలుస్తోంది. కోడిరామ్మూర్తి నాయుడు గురించి ఆంధ్రా ప్రజలు కథలు కథలుగా చెప్పుకొంటారు..
కలియుగ భీమ, మల్ల మార్తాండ రోల్ లో మెగా స్టర్ తన్యయుడు
శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో 1882లో పుట్టిన రామ్మూర్తి నాయుడు అత్యంత శక్తిమంతుడు. కుస్తీ పోటీల్లో తనకు తిరుగు లేదు. తను చేసే విన్యాసాలు అప్పట్లోనే ఒళ్లు గగర్పాటుకు గురి చేసేవి. వేగంగా దూసుకుపోతున్న రెండు కార్లని ఒకేసారి..తన రెండు చేతులతో ఆపేంత శక్తి కోడి రామ్మూర్తి నాయుడుకు ఉండేది. నాయుడు ఓ సర్కస్ కంపెనీ కూడా నిర్వహించారు. కలియుగ భీమ, మల్ల మార్తాండ, వీర కంఠీవ లాంటి బిరుదుల్ని సొంతం చేసుకొన్నాడు..!!