in

nivetha thomas undergoing a huge physical transformation!

నివేదా థామస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ జెంటిల్మెన్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత నిన్ను కోరి, జై లవకుశ వంటి అనేక సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలను దక్కించుకుంది. ఆ సినిమాల్లో ఎంతో అందంగా, సన్నగా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు కాస్త బొద్దుగా తయారయింది. దీంతో నివేదాను చూసిన నెటిజన్స్ ఏమైంది ఇంత లావుగా తయారయింది ఏంటి, నివేదాకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, అందుకే ఇలా లావుగా తయారైందని పలువురు కామెంట్లు చేస్తున్నారు..

అంతేకాదు నివేదా లుక్ పైన ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం నివేదా 35 చిన్న కథ కాదు అనే సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో నివేదా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాల్లో నివేదాను కొంతమంది ఇంత లావుగా తయారయ్యారేంటి అని ప్రశ్నించగా..ఆ ప్రశ్నలను దాటవేస్తోంది. అయితే నివేదా తన తదుపరి సినిమా ప్రాజెక్టు కోసమే ఇలా బరువు పెరిగింది కావచ్చు అని, ఆ సినిమాలో ఏదైనా డిఫరెంట్ రోల్ లో నటిస్తుందేమోనని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్..!!

Malayalam actor Nivin Pauly, five others booked for sexual assault

Balakrishna as Krishna in his son Mokshagna’s debut movie?