in

Ban Threat Issued On Tamil Hero Vishal Movies!

హీరో విశాల్ కు బిగ్ షాక్, తమిళ్ ఇండస్ట్రీ నుండి బ్యాన్
కోలీవుడ్ హీరో విశాల్ కి తెలుగులో కూడా మంచి ఫ్యాన్  ఫాలోయింగ్ ఉంది. విశాల్ ప్రతి సినిమా తెలుగులో డబ్బింగ్ అవుతుంది. విశాల్ ఎప్పుడు ముక్కుసూటిగా మాట్లాడతాడు. నచ్చనిది ఉంటే నచ్చలేదని మొహం మీద చెప్పేస్తాడు. దాపరికాలు లేకుండా మాట్లాడటం వలన తరచూ వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటాడు. ఈ మధ్య కూడా ఇలాగే వివాదం లో చిక్కుకున్నాడు. అది చివరికి  విశాల్ తో సినిమాలు తీయటం బ్యాన్ చేసేవరకు వెళ్ళింది..రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ విశాల్తమిళనాడులో థియేటర్స్ అన్ని కొంతమంది చేతుల్లోనే ఉన్నాయని, వాళ్ళు చెప్పినప్పుడే సినిమా రిలీజ్ చేయాలని, సినిమాలని వాళ్ళ కంట్రోల్ లో ఉంచుతున్నారని’ విమర్శలు చేసాడు.

సినిమాలు చేయడం ఆపను, నిర్మాతలకు విశాల్ కౌంటర్ ఎటాక్!!

దీనితో హార్ట్ అయిన కొందరు విశాల్ ని టార్గెట్ చేస్తూ, విశాల్ నిర్మాత మండలిలో ఉన్నప్పుడు  నిధులు అక్రమంగా ఖర్చుపెట్టి దుర్వినియోగం చేసాడని ఆరోపించారు. అంతే కాకుండా  విశాల్ తో ఇక ముందు నిర్మాతలు ఎవరూ సినిమాలు తీయకూడదని, తమిళ నిర్మాతల సంఘం ఆదేశించింది. ఈ నిర్ణయం వెనక నిర్మాత  కథిరేసన్ ఉన్నట్లు సమాచారం. అయితే నిర్మాతలు ఇలా చేయడాన్ని తప్పుబడుతూ..విశాల్ ‘నేను సినిమాలు చేయడం ఆపను ఎవరు అడ్డు చెబుతారో చూస్తా’ అని కౌంటర్ ఎటాక్ ఇచ్చాడు..!!

mahesh babu the real srimanthudu donates 30 cr every year!

Keerthy Suresh responds on her marriage rumors!