in

mahesh babu the real srimanthudu donates 30 cr every year!

మాజం కోసం, అవసరాల్లో ఉన్నవారికి సాయపడే హృదయం కొద్దిమందికి మాత్రమే ఉంది. వారిలో టాలీవుడ్ నుంచి మహేష్ బాబు ముందు వరుసలో ఉంటారు. మహేష్ కుమారుడు గౌతమ్ కృష్ణ పుట్టినప్పుడు వారికి ఎదురైన ఒక సమస్య వాళ్ళ పుట్టిన ఒక మంచి ఆలోచనతో గత 15 ఏళ్ళ నుంచి చిన్న పిల్లలకోసం తన సంపాదన నుంచి కొంత మొత్తంతో వారికి ఖర్చుచేస్తున్నాడు మహెష్. ఆంధ్ర హాస్పిటల్స్ తో అనుసంధానం అయ్యి ఇప్పటికే వేలాదిమంది చిన్న పిల్లలకు మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా లక్షల్లో ఖర్చయ్యే ఒపేరాశన్లు ఉచితంగా చేయిస్తున్నారు.

ఇవే కాకుండా శ్రీమంతుడు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో మహేష్ ఆంధ్ర ప్రదేశ్లో తన సొంత ఊరు బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. అదే విధంగా తెలంగాణలో సిద్దాపురం ను కూడా దత్తత తీసుకున్నాడు. సొంత నిధులతో బుర్రిపాలెం లో అంగన్వాడీ భవనాలు, గవర్నమెంట్ స్కూల్ ఆధునీకరణ, లైబ్రరీ, కంప్యూటర్ కోచింగ్, డ్రైనేజీ నిర్మాణం లాంటి కార్యక్రమాలు చేసారు. ఇలాంటి సేవ కార్యక్రమాల కోసం మహెష్ బాబు తన సంపాదనలో అక్షరాలా 30 కోట్లు ఖర్చు చేస్తున్నారని సమాచారం. వచ్చిన సంపాదన నుంచి గొప్ప మనసుతో సమాజం కోసం ఇలా ఖర్చు చేయడం చాలా మంచి విషయం..!!

Bellamkonda Sreenivas adventurous film launched!

Ban Threat Issued On Tamil Hero Vishal Movies!