in

sree vishnu’s heroine Reba Monica John gets a mega project!

శ్రీవిష్ణు హీరోగా వచ్చిన సామజవరగమన ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ సినిమా ద్వారా పరిచయమైన హీరోయిన్ రెబ మోనికా జాన్ అందంతో పాటు అభినయం పరంగానూ ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు మళ్ళీ శ్రీవిష్ణుతోనే ఒక క్రైమ్ థ్రిల్లర్ లో భాగం పంచుకుంటోంది. దాదాపు షూటింగ్ పూర్తి కావొస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ కు హుసేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళం, తమిళం, కన్నడలో చెరో సినిమా చేస్తున్న రెబ మోనికా జాన్ కు సూపర్ ఆఫర్ తలుపు తట్టినట్టు టాక్. ఎందుకంటే ఇది ఆషామాషీ అవకాశం కాదు..

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో మొదలైన సంగతి తెలిసిందే. ఫస్ట్ షెడ్యూల్ లో ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇందులో ఒక కీలక పాత్రను రెబ మోనికా జాన్ కు ఆఫర్ చేసినట్టు చెన్నై టాక్. అధికారికంగా ఖరారు చేయలేదు కానీ లీకైన సోర్స్ ని బట్టి చూస్తే నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాని రజనికి జోడిగా మాత్రం కాదట. ఒక యువ హీరోకు జంటగా కథను మలుపు తిప్పే క్యారెక్టర్ ని లోకేష్ ఇచ్చాడని అంటున్నారు. అనౌన్స్ మెంట్ వచ్చేదాకా వేచి చూడాలి..!!

Shruti Haasan As Superstar rajinikanth’s Daughter?

shocking: Kajal Aggarwal is not part of ‘Indian 2’