in

reason why nag ashwin dint show krishna’s face in kalki

కృష్ణుడి పాత్ర కోసం ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇందులో కృష్ణుడి ముఖాన్ని చూపించకుండా అంతా షిల్అవుట్ లో తీశాడు నాగీ. అతను ఎవరు అనేది టీం చెప్పలేదు. కానీ స్వయంగా ఆ క్యారెక్టర్ ని పోషించిన నటుడే సోషల్ మీడియా వేదికగా స్పందించడంతో అందరికీ అన్సర్ దొరికింది. ఈ నటుడి పేరు కృష్ణ కుమార్. ‘ఆకాశం నీ హద్దురా, ‘మారన్‌’ చిత్రాలలో కీలక పాత్రలు పోషించాడు కృష్ణ కుమార్. ఇప్పుడు కల్కిలో కనిపించని కృష్ణుడి రూపంలో దర్శనమిచ్చాడు.

తను కనిపించనప్పటికీ దర్శకుడు నాగ్ అశ్విన్ చాలా ఎఫెక్టివ్ గా ఆ పోర్షన్ ని తీశాడు. నిజంగా కృష్ణుడు ఇలానే నడుస్తాడెమో అన్నంతగా కటౌట్ ని వాడుకున్నాడు. అయితే కృష్ణుడి పాత్ర ముఖాన్ని చూపించకపోవడానికి ఒక కారణం వుంది. కల్కి పార్ట్ 2 లో కృష్ణుడి పాత్ర చాలా కీలకం కానుంది. ఈ పాత్రకు ఇమేజ్ పరంగా పెద్ద స్టార్ కావాలి. ఖచ్చితంగా ఆ స్థానంలో ఓ పెద్ద హీరో నటింపచేయాలనే ఆలోచనతో పార్ట్ 1 లో కృష్ణుడి పాత్రని రివిల్ చేయలేదు నాగీ. సో..కృష్ణుడిగా కనిపించేది ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్..!!

vijay devarakonda opens up about his kalki arjuna role!

choose your actors for ‘Kalki 2898 AD’ characters!