గత కొన్నాళ్లుగా పీకల్లోతు ప్రేమలో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ.. గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. అయితే.. రకుల్ పెళ్లి చేసుకుంది కదా..ఇకపై సినిమాలు చేస్తుందా? లేక సంసార జీవితానికే అంకితమవుతుందా? అనే డౌట్స్ ఉండేవి. కానీ రకుల్ మాత్రం తగ్గేదేలే అంటోంది. ఎప్పటిలాగే సినిమాలు చేస్తోంది. ఇప్పటికే పెళ్లికి ముందు రకుల్ కొన్ని ప్రాజెక్ట్స్‌కి కమిట్ అయింది. వాటిలో కొన్ని సెట్స్ పై ఉండగా.. మరికొన్ని ప్రారంభం కావాల్సి ఉంది. ఈ సినిమాలతో పాటు..కొత్త కథలు కూడా వింటోందట అమ్మడు.
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ..రకుల్ భర్త జాకీ భగ్నానీ అప్పుల పాలయ్యాడనే న్యూస్ షాకింగ్‌గా మారింది. హిందీ చిత్ర పరిశ్రమలోని పెద్ద ప్రొడక్షన్ బ్యానర్‌లలో పూజా ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఒకటి. ఈ సంస్థను జాకీ భగ్నాని తన తండ్రి వాషు భగ్నానితో కలిసి నడిపిస్తున్నాడు. అయితే..ప్రస్తుతం ఈ సంస్థ పరిస్థితి ఏమాత్రం బాగా లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ ఉద్యోగులలో దాదాపు 80 శాతం మందిని తొలగించిందట. అలాగే..ఆఫీస్‌ని జుహులోని డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌కి మార్చినట్లు ప్రచారం జరుగుతోంది..!!