ఏడాది క్రితం తెలుగులో శ్రీలీల రేంజ్ చూస్తే మరో రెండు-మూడేళ్లు ఆమె కొత్త సినిమాలకు దొరకడం కష్టమనే మాట వచ్చింది. రవితేజ ధమాకాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. నిర్మాతలు అడ్వాన్సులతో క్యూలు..వరుస అవకాశాలు.. డేట్స్ కోసం పోటీ. అలానే ఆమె సినిమాలు వరుసగా వచ్చేశాయి. సినిమా ఏదైనా..హీరో ఎవరైనా..శ్రీలీల హీరోయిన్ అయితే బాగుండననే టాక్ వచ్చేసింది. కానీ.. వరుస ఫెయిల్యూర్స్ పలకరించడంతో కాస్త స్లో అయింది..
వరుస ఫ్లాపులతో ఆమె హవా కాస్త తగ్గిందనే మాట నిజం. దీంతో ఆమె పేరు కూడా పెద్దగా వినిపించలేదు. ప్రస్తుతం రెండు సినిమాల ప్రకటనతో మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. రవితేజతో సినిమా, నితిన్-వెంకీ కుడుముల రాబిన్ హుడ్ సినిమాలతో బిజీ అయిపోయింది. పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లో ఉంది. దీంతో ఆమె ప్యాన్స్ హుషారులో ఉన్నారు. చిలిపితనం, గ్లామర్, డ్యాన్స్ టాలెంట్ పుష్కలంగా ఉన్న రష్మిక మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతుందని అంటున్నారు..!!