in

Samantha’s Malayalam debut with Mammootty!

తెలుగు, తమిళం, హిందీ  భాషల్లో సత్తా చాటిన సమంత  ఇప్పుడు మల్లువుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. ఈ మధ్య కాలంలో వరుస హిట్లతో మల్లు సినిమాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తక్కువ బడ్జెట్ తో కోట్ల లాభాలు గడిస్తున్నాయి. దీనితో పలువురు  తారలు మల్లువుడ్ లో నటించటానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే అనుష్క మలయాళం లో ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సామ్ కూడా మల్లువుడ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇప్పటివరకు సామ్ అన్ని భాషల్లోనూ యంగ్ హీరోలతో నటించింది. సీనియర్స్ తో జోడికట్టలేదు. కానీ మొదటి సారిగా మలయాళంలో సీనియర్ హీరోతో నటిస్తోంది. అతను మరెవరో కాదు కుర్ర హీరోలతో పోటీ పడి ఈ ఏజ్ లో కూడా  ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ, వరుస విజయాలు సాధిస్తున్న మమ్ముట్టి. గౌతమ్ మీనన్ దర్శకత్వం లో తెరకెక్కతున్న ఈ మూవీ లో మమ్ముట్టి కి జోడిగా సామ్ నటిస్తోంది. పోలీస్ ఇన్వెస్ట్ గేటివ్ థ్రిల్లర్ గా ఈ మూవీ రూపొందుతోందని సమాచారం..!!

Harom Hara!

Lady Superstar Nayanthara joins Yash’s ‘Toxic’!