in

Sai Pallavi to direct a film soon!

లయాళ ముద్దుగుమ్మ, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న నటి. ఫిదా సినిమాతో అందరిని మాయ చేసిన ఈ నాట్య మయూరి తరువాత వరుసగా సినిమాలు చేస్తూ అలరించింది. తెలుగు, మలయాళంతో పాటు ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో తన మనసులోని మాట బయటపెట్టింది. ఫ్యూచర్‌లో డైరెక్షన్ చేయాలని ఉందని చెప్పేసింది.

సినిమాల్లో నటించడం కన్నా డైరెక్షన్ చేయడం కష్టమైన పనియే అయినప్పటికీ ఒక్క సినిమాకు అయినా తాను దర్శకత్వం వహిస్తుందట. అంతే కాదు తనకు నచ్చిన ఓ అద్భుతమైన కథను కూడా సిద్ధం చేస్తున్నా అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను సినిమా షూటింగ్‌లలో బిజీగా ఉండడం మూలంగా కథ ఇంకా పూర్తి కాలేదని, త్వరలోనే పూర్తి చేయనున్నట్లు వెల్లడించింది. ఇంకా నిర్మాత ఫిక్స్ కాలేదని, త్వరలోనే దానికి సంబంధించిన అన్ని విషయాలను చెప్తా అని సాయిపల్లవి చెప్పారు..!!

actress Taapsee Pannu got married secretly?

star heroine alia bhatt in mahesh babu – rajamouli film?