మొదటిసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆది సినిమాతో దర్శకుడి గా అడుగుపెట్టిన వివి వినాయక్.. ఆ తర్వాత.. దిల్, చెన్నకేశవరెడ్డి, లక్ష్మి, సాంబ తదితర సినిమాలకి దర్శకుడి గా వ్యవహరించి.. మంచి విజయాన్ని అందుకున్నారు. దీంతో డైరెక్టర్ గా పేరుపొందారు వివి వినాయక్. సినిమా ఇండస్ట్రీలో హీరోలు ప్రొడ్యూసర్లు ఎవరైనా సరే తమ వారసులు సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వాలి అంటే అది కేవలం వివి వినాయక వల్ల సాధ్యమవుతుందని చెప్పవచ్చు.
ఇదంతా పక్కకు పెడితే.. టాలీవుడ్ డైరెక్టర్ వివి వినాయక్ వైసీపీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనతో ఆ పార్టీ నేతలు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ కు దీటుగా సినీ గ్లామర్ ను జోడించడంతోపాటు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో వినాయక్ ను రంగంలోకి దింపాలని వైసీపీ భావిస్తుందట. కాకినాడ లేదా ఏలూరు నుంచి ఎంపీగా ఆయనను పోటీలో నిలపాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది…!!