బిగ్‌బాస్ ఫైనల్స్ అనంతరం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద అభిమానులు వీరంగం సృష్టించిన కేసులో పల్లవి ప్రశాంత్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్స్ అనంతరం బయటకు వచ్చిన కంటెస్టెంట్ల వాహనాలను అభిమానులుగా విడిపోయిన కొందరు ధ్వంసం చేశారు. అంతేకాదు, అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సులపైనా ప్రతాపం చూపారు. బస్సుల అద్దాలు పగలగొట్టారు.
ఈ ఘటనకు సంబంధించి పల్లవి ప్రశాంత్‌తోపాటు మరికొందరిపైనా ఇప్పటికే కేసులు నమోదు కాగా, తాజాగా విధ్వంసంలో పాల్గొన్న అభిమానులపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. పల్లవి ప్రశాంత్ ఈ కేసులో ఏ1 నిందితుడు కాగా, అతడితోపాటే ఉండి అభిమానులను రెచ్చగొట్టిన అతడి సోదరుడు మనోహర్‌ను ఏ2గా, వారి స్నేహితుడు వినయ్‌ను ఏ3గా చేర్చారు..!!