నాగ చైతన్య మెయిన్ లీడ్ లో దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కించిన ఓ ఆసక్తికరమైన హారర్ థ్రిల్లర్ సిరీస్ నే “దూత”. ఎప్పుడో కరోనా లాక్ డౌన్ టైం లో స్టార్ట్ అయ్యిన ఈ సిరీస్ ఇప్పుడు అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఓటిటి లో రిలీజ్ కి సిద్ధం అయ్యింది. కాగా ఈ సిరీ హక్కులు ప్రముఖ సంస్థ ప్రోమ్ వీడియో తీసుకోగా అందులో ఈ సిరీస్ ని ఎప్పుడు నుంచి ప్రసారం కి తీసుకొస్తారో కన్ఫర్మ్ చేశారు. ఈ సిరీస్ డిసెంబర్ 1 నుంచి అయితే అందుబాటులోకి వస్తుంది అని తెలిపారు.
మొత్తానికి అయితే చైతు కూడా ప్రైమ్ వీడియో తోనే ఎంట్రీ ఇస్తున్నాడు. మరి ఇదే ప్రైమ్ వీడియోతో ఓటిటి ఎంట్రీ ఇచ్చింది తన మాజీ భార్య సమంత. అయితే కొన్ని అంశాలు పక్కన పెడితే సమంతకి ఓటిటి లో అదొక సెన్సేషనల్ ఎంట్రీ అని చెప్పాలి. మరి ఆ రేంజ్ లో లేదా అంతకు మించే థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో వచ్చి నాగ చైతన్య సమంతకి ఓటిటి లో చెక్ చెప్తాడో లేదో చూడాలి మరి..!!