దర్శకుడు ప్రశాంత్ నీల్ అలాగే పాన్ ఇండియా హీరో ప్రభాస్ ల కలయికలో వస్తున్నా ఈ మాస్ ప్రాజెక్ట్ పై హైప్ ఆకాశంలో ఉండగా ఈ మధ్యలోనే కొన్ని రూమర్స్ కూడా గట్టిగా వైరల్ గా మారాయి. సినిమా ఒక్క భాగంగా ఉంటుందా రెండు భాగాలుగా ఉంటాయా ఇలా చాలానే స్పెక్యులేషన్స్ నడుస్తూ ఉండగా ఈ భారీ చిత్రంపై అయితే తాజాగా ప్రముఖ హీరోయిన్ హన్సిక చేసిన కామెంట్స్ ప్రభాస్ ఫ్యాన్స్ ని షేక్ చేస్తున్నాయి. కాగా ఆమె మాట్లాడుతూ తాను ఇపుడు వస్తున్నా కల్కి, పుష్ప 2 ఈ సినిమాలకి కాదు సలార్ కోసం వెయిట్ చేస్తున్నాను అని తెలిపింది.
ఆ సినిమాలో నటి శ్రీయ రెడ్డి నాకు అన్ని విషయాలు చెప్తుంది. అలానే సలార్ కోసం కూడా చాలానే షేర్ చేసుకుంది. సలార్ పార్ట్ 1 బాగుంటే పార్ట్ 2 దాని కంటే సూపర్బ్ గా ఉంటుంది అని చాలా కాన్ఫిడెంట్ గా అయితే చెప్పింది. దీనితో ఈ భారీ చిత్రం డెఫినెట్ గా రెండు భాగాలుగా వస్తుంది అనేది కన్ఫర్మ్ కాగా.. రెండు సినిమాలు కూడా స్యూర్ షాట్ గా భారీ హిట్ లు గా నిలుస్తాయి అని కూడా కన్ఫర్మ్ అయ్యిపోయింది. మరి సినిమాలో నటించకపోయినప్పటికీ కూడా ఇంటర్వ్యూలో ఆప్షన్స్ లో లేకపోయినా కూడా స్పెషల్ గా సలార్ సినిమా మెన్షన్ చేసి మరీ చెప్పింది అంటే అది ఏ లెవెల్లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు..!!