in

rana to lock horns with chiranjeevi?

రానా..మెగాస్టార్ చిరంజీవికి విలన్‌గా నటించబోతున్నాడన్న వార్త టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా దసరా రోజు కొత్త సినిమా మొదలైన సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘విశ్వంభర’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు పని చేసే సాంకేతిక నిపుణుల వివరాలు బయటికి వచ్చాయి కానీ..కాస్టింగ్ సంగతే ఇంకా తేలలేదు.

హీరోయిన్లుగా రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి..విలన్ పాత్రకు రానా ఓకే అయినట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఐతే చిరుకు విలన్‌గా రానా అంటే ప్రేక్షకులు అంగీకరిస్తారా అన్నదే డౌట్. ఎందుకంటే చిరుకు బేసిగ్గా రానా బాగా క్లోజ్. రామ్ చరణ్‌కు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ రానానే. అతణ్ని కూడా తన కొడుకులా చూస్తాడు చిరు. వ్యక్తిగతంగా ఇలాంటి అనుబంధం ఉన్న వాళ్లు సినిమాలో హీరో-విలన్ పాత్రలు చేస్తే సెట్ అవుతుందా అన్న డౌట్ ఉంది..!!

‘modhati muddhu bharthake’ says sreeleela!

clash between rashmika and mythri movie makers?