in

Curious Case of Anushka Shetty’s no public appearance!

నుష్క మూవీస్‌లో యాక్ట్ చేస్తోందే తప్ప జనంలోకి రాలేకపోతుందా..? లావు తగ్గలేక పోవడంతో పబ్లిక్‌లోకి రావడానికి ఇబ్బంది పడుతోంది. ఇన్ని ఇబ్బందుల్లో కూడా ఇప్పుడు మొదటిసారి మలయాళం మూవీలో చేస్తుంది బొమ్మాళి. చాలా గ్యాప్‌ తర్వాత ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’తో వచ్చి సక్సెస్‌ చూసింది. ఫామ్‌లోకి వచ్చిన బొమ్మాళీ..ఓ సీనియర్‌ స్టార్‌తో జత కడుతోందన్న వార్త  చక్కర్లు కొడుతోంది. మిస్‌ శెట్టి .. మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్‌లో కనిపించకపోయేసరికి అనుష్కకు ఏమైంది..? ఎందుకు బైటకి రావడం లేదంటూ..రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.

వెయిట్‌ తగ్గలేదని, అందుకే బాడీ షేమింగ్‌ చేస్తారని రావడం లేదా? అనే అనుమానం చాలామందికి వుంది. సినిమాలో బాడీ సన్నగా వున్నా..టెక్నాలజీతో తగ్గించారంటున్నారు. ఫేస్‌ మాత్రం టాయ్‌లా వుంది. అనుష్క ఔటాఫ్‌ స్టేషన్‌. అందుకే రావడం లేదంటూ హీరో నవీన్‌..చిత్ర యూనిట్‌ కవర్‌ చేస్తూ వస్తున్నారు. ఆమధ్య వీడియో రిలీజ్‌లో థ్యాంక్స్‌ చెప్పిందే తప్ప..సక్సెస్‌మీట్‌లోనూ కనిపించలేదు. అనుష్క వెయిట్‌ తగ్గిందా..? పెరిగిందా..? అనే సంగతి పక్కన పెడితే, బంపర్‌ ఆఫర్లు రావడం చూస్తుంటే లావుగా వుంటే ఛాన్సులు ఎందుకిస్తారు అనిపిస్తోంది..!!

Vijay Antony’s daughter meera dies by suicide!

Keerthy Suresh and Anirudh Wedding Rumors, Father Reacts!