in

Kamal Haasan to be honoured with Outstanding Achievement in Indian Cinema award!

రు దశాబ్ధాలుగా విలక్షణ నటనతో అలరిస్తున్న కమల్‌హాసన్‌ ఖాతాలో మరో అవార్డు చేరనుంది. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గానూ జీవిత సాఫల్య పురస్కారం అందుకోనున్నారు..ఆరు దశాబ్ధాలుగా విలక్షణ నటనతో అలరిస్తున్న కమల్‌హాసన్‌ ఖాతాలో మరో అవార్డు చేరనుంది. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గానూ జీవిత సాఫల్య పురస్కారం  అందుకోనున్నారు. ఈ నెల 27న అబుదాబిలో జరగనున్న అంతర్జాతీయ భారతీయ చలనచిత్ర వేడుకల్లో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు.

ఈ విషయాన్ని ఐఫా నిర్వాహకులు వెల్లడించారు. విశ్వనాయకుడిగా కమల్‌ ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఇప్పుడీ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డు రావడంతో అభిమానులు హర్షిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. కమల్‌హాసన్‌ ప్రస్తుతం ‘ఇండియన్‌ 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ చెన్నైలో శరవేగంగా జరుగుతోంది..!!

Krithi Shetty To Do An Item song?

manchu vishnu shocking comments about telugu star heroes!