మెగా స్టార్ చిరంజీవి ఈ రోజు ఎందరో కాబోయే నటులకు, ఎదుగుతున్న నటులకు ఆదర్శం! స్ఫూర్తి! అందరు ఆయన అందుకున్న విజయాలు, అధిరోహించిన శిఖరాల గురించే మాట్లాడుతారు కానీ, సినీ పరిశ్రమలో ముందు వెనుక ఎవరు లేకుండా, ఒంటరి ప్రయాణం మొదలు పెట్టి, ప్రతి అడుగు ఎంతో జాగ్రత్త గ వేసుకుంటూ, ఎదిగిన తీరు వేరేవారికి సాధ్యం కాదు. ఆయన గడిపిన నిద్ర లేని రాత్రులు, తనకు వచ్చిన పాత్రలు పండించటానికి అయన పడిన తపన, నిర్మాతలు సీనియర్ నటుల పట్ల ఆయన చూపిన వినమ్రత ఆయనను ,నటుడిగా నిలబెడితే, ఆయనలోని నటుడు ఆయనను మెగా స్టార్ చేసాడు. చిరంజీవి గారు “మాయగాడు” అనే చిత్రంలో నటించారు కానీ ఆయనను నిజ జీవితం లో మోసం చేసిన “మాయగాడు “ఒకరు ఉన్నారు. చిరంజీవి గారిని కూడా కెరీర్ మొదటి దశలో, ఒక నిర్మాత మోసం చేసారు, మోసగించటం అంటే డబ్బులు ఎగవేయటం వంటిది కాదు, ఆయనను హీరోగా పెట్టి సినిమా తీస్తానని చెప్పి ఆయన చేత తన చిత్రాలలో విలన్ వేషం , గెస్ట్ వేషం, వేయించుకొని ఆ తరువాత ఒట్టు తీసి గట్టు మీద పెట్టేసారు సదరు నిర్మాత గారు.
” సత్య చిత్ర ” సూర్యనారాయణ గారు చిరంజీవి గారిని పిలిచి వారు కృష్ణ గారి తో నిర్మిస్తున్న “కొత్త అల్లుడు ” చిత్రంలో విలన్ వేషం వేయమని అడిగారట , అప్పటికే “ఊరుకిచ్చిన మాట” “ఆరని మంటలు” అనే చిత్రాలలో హీరో గ నటిస్తున్న చిరంజీవి గారు తటపటాయించి, విలన్ గ చేయటం లేదు సర్ అని చెప్పిన తరువాత, సూర్యనారాయణ గారు చిరంజీవి గారితో, నెక్స్ట్ పిక్చర్ మీతోనే, మీరే హీరో ,అనగానే చిరంజీవి గారు ఒప్పుకున్నారట. ఆ తరువాత కొద్దీ రోజులకు మళ్ళీ హీరో కృష్ణ గారితోనే ఇంకొక చిత్రం “కొత్త పేట రౌడీ” మొదలు పెట్టారట సూర్యనారాయణ, అందులో గెస్ట్ పాత్ర చేయమని అడిగారట, అదేమిటి సర్, నాతో సినిమా చేస్తానన్నారు ,అని అడిగిన చిరంజీవి గారితో మీ సినిమా స్టోరీ రెడీ అవుతుంది అది అవగానే మొదలెడదాం అని చెప్పారట, దానితో అందులో గెస్ట్ క్యారెక్టర్ కూడా చేశారట చిరంజీవి గారు. ఇన్ని కబుర్లు చెప్పిన సూర్యనారాయణ తరువాత చిరంజీవి గారి ఊసే ఎత్తలేదు, ఈ సంఘటన చిరంజీవి గారిని ఎంతో బాధించిన, ఎవరితోనూ చెప్పుకోలేదు, తనలో తానే కుమిలిపోయారే తప్ప ఎవరిని తూలనాడలేదు.” అయన ఓరిమే ఆయనకు శ్రీ రామ రక్ష, ఆయన నటనే ఆయన కు అండ దండా, అందుకే ఆయన ఎప్పటికి మెగా స్టార్”!