సమంత ప్రస్తుతం తన ప్రాజెక్ట్‌ల కోసం, పాత్రల కోసం తగినట్టుగా మారుతోంది. అందుకే హెవీ వర్కౌట్లు చేస్తోంది. ఆమె ఇప్పుడు నైనిటాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం రాజ్ అండ్ డీకే సిటాడెల్ వెబ్ సిరీస్, శివ నిర్వాణ ఖుషి సినిమాను పూర్తి చేయాలని అనుకుంటోంది. ఈ ప్రాజెక్టుల కోసమే హెవీ వర్కౌట్లు చేస్తోంది. యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం రిహార్సల్స్ చేస్తోంది. అయితే ఈ క్రమంలో సమంత చేతికి గాయాలయ్యాయి. చేయి, వేళ్లు అంతా కూడా కమిలిపోయి రక్తం కారుతూ ఉంది. సమంత ప్రస్తుతం ఎంతగా కష్టపడుతోందో.. ఎంత కసిగా ఉందో చెప్పడానికి ఈ ఫోటో ఓ ఉదాహరణగా నిలుస్తుంది.
ఇంతలా రిహార్సల్స్ చేస్తూ యాక్షన్ సీక్వెన్స్‌లు చేస్తోందంటే.. తెరపై ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ట్రైనర్ జునైద్ ఆధ్వర్యంలో ఈ రిహార్సల్స్ చేస్తున్నట్టుగా ఉంది. సమంత తన చేతి పరిస్థితిని చెబుతూ ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ పెట్టేసింది. ఇక ఆ పోస్టుకు ట్రైనర్ జునైద్ రిప్లై ఇచ్చాడు. వీటిని కొందరు గాయాలని అంటారు కానీ అవి మనకు ఆభరణాలు అని కామెంట్ పెట్టాడు. దీంతో జునైద్ మాటలకు సమంత దండం పెట్టేసింది. యోధుడు అనే వాడికి గాయాలే ఆభరణాలు అనే నానుడి ఉందన్న సంగతి తెలిసిందే. దాన్ని ఇప్పుడు సమంతకు అన్వయించాడు జునైద్..!!