తెలుగు దేశం పార్టీ నేత నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర యువగళంలో మొదటి రోజే అపశృతి చోటు చేసుకున్న విషయం తెల్సిందే. నందమూరి తారకరత్న కళ్ళు తిరిగిపడిపోవడం సంచలనంగా మారింది. ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తర్వాత రిపోర్ట్స్ లో తేలింది. తారకరత్నకు యాంజియోగ్రామ్ చేయగా రక్తం సరఫరా చేసే నాళాల్లో 90 శాతం బ్లాక్ లు ఉన్నట్లు తేలింది. నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ కంగారు పడాల్సిన పనిలేదని తర్వాతి చికిత్సల కోసం బెంగళూరుకు తరలించినట్లు తెలిపారు..అయితే తారకరత్న శరీరం నీలం రంగులోకి ఎందుకు మారింది అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఈ సందర్భంగా డాక్టర్ ముఖర్జీ మాట్లాడుతూ ఆయన శరీరం నీలం రంగులోకి మారడానికి కారణం రక్తం తక్కువగా ఉండటమే అని చెప్పుకొచ్చారు. రక్తంలో కార్బన్ డైయాక్సయిడ్ ఎక్కువయ్యి, ఆక్సిజన్ శాతం తగ్గినప్పుడు అలా అవుతుందని చెప్పుకొచ్చారు..!!