పుష్ప సినిమా హిట్ అవ్వడంతో రష్మిక కి బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు వస్తున్నాయి. దీంతో ఈ అమ్మడు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సరసన నటిస్తోంది. ఇలా ప్రస్తుతం సౌత్, నార్త్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండే రష్మిక గురించి బాలీవుడ్ సినీ క్రిటిక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎల్లప్పుడూ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వివాదాల్లో నిలిచే కె ఆర్ కె ఇప్పుడు రష్మిక గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కె ఆర్ కె ట్విట్టర్ వేదిక స్పందిస్తూ..“సౌత్ సినిమాలలో, భోజ్ పురి సినిమాలలో మాత్రమే రష్మిక మందన హీరోయిన్గా సెట్ అవ్వగలదు అని..హిందీ చిత్రాలలో ఆమె ఫేస్ కి అంత వాల్యూ లేదు. ఐశ్వర్యారాయ్, మాధురి దీక్షిత్, కరీనా కపూర్ వంటి అందాన్ని చూసిన బాలీవుడ్ ప్రేక్షకులకు రష్మీక అందం నచ్చదు.
హిందీ చిత్రాల్లో ఆమె రాణించాలి అనుకోవడం రాంగ్ డెసిషన్ ” అంటూ ట్వీట్ చేశాడు. ఇలా రష్మీకి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందిన ఆ ఫేస్ గురించి ఇలా మాట్లాడటంతో ఆమె అభిమానులు కె ఆర్ కె మీద చాలా ఫైర్ అవుతున్నారు. ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న రష్మిక కి బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునేంత సీన్ లేదని వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఈమెకి బాలీవుడ్ స్థాయికి సరిపోయేంత అందం లేదని వ్యాఖ్యలు చేయటంతో ఆమె అభిమానులు ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం పుష్ప2 సినిమాతో పాటు బాలీవుడ్ లో మరొక రెండు సినిమాలలో నటిస్తూ రష్మీక బిజీగా ఉంది. ఇక ఈ వార్తలపై రష్మీక ఎలా స్పందిస్తుందో చూడాలి మరి..!!