in

A STORY BEHIND THE TITLE ‘adithya 369’!

దిత్య 369 టైటిల్ వెనుక ఉన్న ఇంటరెస్టింగ్ స్టోరీ, జనరల్ గ హీరో ని ఎలివేట్ చేస్తూ సినిమా టైటిల్ పెడుతుంటారు, కొన్ని సందర్భాలలో స్టోరీకి సింబాలిక్ గ టైటిల్ పెడుతుంటారు, అందులోను బాలయ్య బాబు సినిమా అంటే టైటిల్ చాల పవర్ఫుల్ గ పెడుతుంటారు. అందుకు భిన్నంగా ఈ చిత్రానికి ఆదిత్య 369 అనే టైటిల్ పెట్టారు, ఇందులో బాలయ్య చేసిన రోల్ పేరు ఆదిత్య కాదు మరి ఈ టైటిల్ ఎందుకు పెట్టినట్లు? సినిమా షూటింగ్ ప్రారంభం అయిన తరువాత నిర్మాత కృష్ణ ప్రసాద్ గారు ఈ చిత్రానికి “జగదేకవీరుడు”, ” యుగ పురుషుడు” అనే టైటిల్స్ అనుకోని డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు గారికి చెప్పారట, అయన బాగున్నాయి బాలయ్యకి చెప్పండి అని చెప్పారట. ఈ టైటిల్స్ విన్న బాలయ్య వెంటనే రెండు టైటిల్స్ యెన్.టి.ఆర్. నటించిన చిత్రాలివి వాటి జోలికి వెళ్ళకండి అని ఖచ్చితంగా చెప్పేశారట.

ఆ తరువాత సినిమా కథను అనుసరించి, అందులో హీరో కాలం లో ప్రయాణించటం, టైం మెషిన్, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని, సృష్టిలో కాలం తో ప్రయాణించేవాడు సూర్యుడు కాబట్టి ఆయన పేరును అంటే ఆదిత్య అని,టైం మెషిన్ ఉంది కాబట్టి 369 అనే నెంబర్ ని అనుకున్నారట. ఈ టైటిల్ ని సింగీతం గారికి చెప్పగానే ఆయన చాల బాగుంది అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట, టైటిల్ వినిన బాలయ్య 369 నెంబర్ యొక్క టోటల్ నైన్ వస్తుంది, అంటే నవగ్రహాలకు సింబాలిక్ గ ఉంది, నవగ్రహాలలో సూర్య భగవానుడు ఒకరు కాబట్టి, ఈ టైటిల్ చాల బ్రహ్మాండంగా గ ఉంది ఈ టైటిల్ నే ఫైనలైజ్ చేయండి అని చెప్పారట. యెన్.టి.ఆర్. లక్కీ నెంబర్ కూడా 9 కావటం ఇక్కడ విశేషం, తెలుగు దేశం పార్టీ స్థాపించిన 9 నెలలోనే ఆయన ఆంధ్ర రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ అయ్యారు..!!

samantha’s present Health Condition Clarified By Her Team!

kantara hero rishab shetty gives a counter to rashmika!