in

samantha’s present Health Condition Clarified By Her Team!

క్షల్లో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధితో సమంతా బాధపడుతున్నట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. వీటిని తొలుత పుకార్లుగా అంతా కొట్టిపారేశారు. కానీ స్వయంగా సమంత అది నిజమేనని ‘‘మయోసైటిస్’ అనే వ్యాధి బారిన తాను పడినట్లు ఆమె ప్రకటించారు. దీంతో అభిమానులు, సినీ ప్రపంచం షాక్‌కు గురైంది. యశోదా సినిమా ప్రమోషన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ సామ్ కన్నీటి పర్యంతమయ్యారు. మయోసైటిస్‌కు చికిత్స తీసుకుంటున్న సమయంలోనే సమంత ఆరోగ్యంపై ఆన్‌లైన్‌లో గాలి వార్తలు చక్కర్లు కొట్టాయి. సమంత తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారని ఆ వార్తల్లో రాశారు.

దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే సోషల్ మీడియాలో గెట్ వెల్ సూన్ సామ్ అనే హ్యాష్‌ ట్యాగ్ వైరల్ అయ్యింది. అలాగే సమంత సిబ్బందిని ట్యాగ్ చేస్తూ ఆమె ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. వ్యవహారం శృతిమించడంతో సమంత మేనేజర్ స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. సమంత ఇంట్లోనే వున్నారని, ఆరోగ్యం కూడా బాగానే వుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. గతంలో మాదిరిగానే జిమ్‌లో వర్కవుట్లు చేస్తున్నారని మేనేజర్ వెల్లడించారు. సమంత ఆరోగ్యం గురించి వస్తున్న వదంతుల్ని నమ్మొద్దని ఆయన సూచించారు..!!

uppena director unable to decide between charan and tarak!

kantara hero rishab shetty gives a counter to rashmika!