తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఉన్నఫలంగా ఇండస్ట్రీకి దూరమైనటువంటి వారిలో నటి మమత మోహన్ దాస్ ఒకరు. ఈమె తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ నాగార్జున వంటి హీరోల సినిమాలలో నటించి సందడి చేశారు. ఈ విధంగా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న మమతా మోహన్ దాస్ క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విధంగా ఈమెకు క్యాన్సర్ అని తెలియడంతో ఈమె విదేశాలలో చికిత్స చేయించుకుని క్యాన్సర్ మహమ్మారి నుంచి బయటపడ్డారు.
ఈ క్రమంలోనే తాను ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ అందరికీ అవగాహన కూడా కల్పించారు. ఇలా క్యాన్సర్ తో పోరాడి జయించిన ఈమె ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. ఇకపోతేగత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈమె గురించి ఈమె ఆరోగ్య సమస్యల గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఈమె ఒకసారి క్యాన్సర్ తో పోరాడి జయించినప్పటికీ మరోసారి క్యాన్సర్ మహమ్మారి బారిన పడ్డారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి..ఈ విషయం తెలిసినటువంటి ఎంతో మంది అభిమానులు కంగారుపడుతూ తనకు మెసేజ్ చేస్తున్నారంటూ ఈమె తెలియజేశారు. ఈ క్రమంలోనే ఈ వార్తలపై స్పందించిన మమతా మోహన్ దాస్ తన ఆరోగ్యం గురించి వచ్చే వార్తలను ఎవరు నమ్మకండి అవన్నీ కూడా పూర్తిగా ఆ వాస్తవం తాను తిరిగి క్యాన్సర్ బారిన పడలేదని ప్రస్తుతానికి ఆరోగ్యంగా ఉన్నానని ఈమె తెలియజేశారు..!!