in

Kirti Kulhari says ex-husband gave her confidence to do kissing scenes!

బాలీవుడ్ చిత్రం పింక్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి కల్హారీ. ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఈమె నటించిన ఫోర్ మోర్ షాట్స్ గురించైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలే ఈ వెబ్‌సిరీస్ మూడో సీజన్ విడుదలైంది. ఇందులో ఈమె పర్ఫార్మెన్స్‌కు ప్రత్యేక మార్కులు పడతాయి. ముఖ్యంగా శృంగార, బోల్డ్ సన్నివేశాల్లో అదరగొట్టింది. అయితే తాను ఈ సన్నివేశాల్లో నటించేందుకు తన మాజీ భర్త సాహిల్ సెహగెల్ ఎంతో సపోర్ట్ చేసేవాడని తెలియజేసింది..

నేను 2016లో వివాహం చేసుకున్నాను. ఇక్కడ నా మాజీ భర్త సాహిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఫోర్ మోర్ షాట్స్ వెబ్‌సిరీస్‌లో నటించేటప్పుడు నాకు అతడు నిజంగా సపోర్ట్ చేశాడు. నా భార్య రొమాంటిక్ లేదా ముద్దు సన్నివేశాల్లో నటిస్తుందని అతడు అభద్రతా భావానికి గురయ్యే వ్యక్తి కాదు. మన పరిశ్రమలో చాలా మంది ఈ విషయంలో అభద్రతా భావంతో ఉంటారు. కానీ నేను మాత్రం ఈ అంశంలో తల వంచాలనుకోలేదు. ఇందుకు నా భర్త మద్దతు ఇచ్చాడు. ఇచ్చిన క్యారెక్టర్‌కు ఏం కావాలో అదే చేశాను. నేను ఇందుకు సిద్ధంగా ఉన్నాను. అని కీర్తి స్పష్టం చేసింది.

Samantha’s First hero To Direct Her next film?

why krishna dropped his desire movie ‘Chatrapathi Shivaji’ biopic?