బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటించిన ‘మిలి’ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి ఇటీవల జరిగిన ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది జాన్వీ. సినిమా షూటింగ్ లో జరిగిన కొన్ని విషయాలను పంచుకున్నారామే. ఆ సినిమా షూటింగ్ తన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేసిందో చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో జాన్వీ కోల్డ్ స్టోరేజ్ రూమ్ లో ఇరుక్కున్న అమ్మాయి పాత్రలో కనిపిస్తోంది. గంటల తరబడి కోల్డ్ స్టోరేజ్ లో ఇరుక్కుని ఆ అమ్మాయి ప్రాణాలను రక్షించుకోడానికి ఎలా పోరాడగలిగింది??
ఎలా బయటపడింది అనే అంశంతో ఈ సినిమా తెరకెక్కింది..ఈ సినిమా షూటింగ్ సమయంలో తన మానసిక ఆరోగ్యం పై చాలా ప్రభావం చూపిందని పేర్కొంది. షూటింగ్ తర్వాత ఇంటికి వచ్చాక కూడా ఇంకా ఫ్రీజర్ లోనే ఉన్నట్టు కలలు వచ్చేవని చెప్పింది. ఫ్రీజర్ లో ఎక్కువ రోజులు షూటింగ్ చేయడం వలన తాను శారీరకంగా కూడా ఇబ్బందులు పడ్డానని, ఒంటి నొప్పులతో బాధపడ్డానని, వాటి కోసం మెడిసిన్ కూడా వాడినట్లు పేర్కొంది. తనతో పాటు దర్శకుడు కూడా అనారోగ్యానికి గురి అయ్యారని చెప్పింది. 15 గంటలు ఫ్రీజర్ లో ఇరుక్కుపోతే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయంగా ఉంటుందన్నారు. ఈ సినిమా కోసం బరువు కూడా 7.5 కేజీలు పెరిగానని చెప్పింది. .!!