సీనియర్ హీరోయిన్, నటి రంభ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారు మంగళవారం ప్రమాదానికి గురి అయ్యింది. ఆ సమయంలో కారులో రంభతో పాటు ఆమె పిల్లలు, చిన్నారుల సంరక్షణ బాధ్యతలు చూసుకునే ఆయా ఒకరు ఉన్నారు. దేవుడి దయ వల్ల ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని రంభ తెలిపారు. అసలు వివరాల్లోకి వెళితే..”పిల్లలను స్కూల్ నుంచి తీసుకు వస్తుండగా..ఇంటర్ సెక్షన్ దగ్గర మా కారును మరో కారు ఢీ కొట్టింది. అప్పుడు కారులో నాతో పాటు పిల్లలు, ఆయా ఉన్నారు. చిన్న చిన్న గాయాలు అయ్యాయి. మేం అందరం సేఫ్ గా ఉన్నాం.
చిన్నారి సాషా ఇంకా ఆసుపత్రిలో ఉంది. బ్యాడ్ టైమ్ నడుస్తోంది. మా కోసం దేవుడిని ప్రార్థించండి. చిన్నారి త్వరగా కోలుకోవాలని కోరుకోండి. మీ ప్రార్థనలు మాకు ఎంతో అవసరం” అని రంభ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆస్పత్రిలో ఉన్న చిన్నారి ఫోటోతో పాటు కార్ యాక్సిడెంట్ ఫోటోలను రంభ షేర్ చేశారు. ఎస్‌యువి కార్ కావడంతో యాక్సిడెంట్ అయిన వెంటనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినట్టు తెలుస్తోంది. అందువల్ల, ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. కాకపోతే డోర్స్ మాత్రం బాగా డ్యామేజ్ అయ్యాయి. రంభ పోస్ట్ చూసి ఆడియన్స్ షాక్ అయ్యారు. ఆవిడ త్వరగా కోలుకోవాలని మెసేజ్, పోస్టులు చేస్తున్నారు..!!