ఒకప్పుడు కుర్రకారుని ఉర్రూతలూగించిన కథానాయిక నమిత. బొద్దుగా.. ముద్దుగా.. కనిపిస్తూ, రొమాంటిక్ చూపులతో యువతరం హృదయాల్ని దోచుకొంది. కొంతకాలంగా నమితకు సినిమాల్లేవు. ఇప్పుడు రాజకీయాల వైపు దృష్టి సారించబోతోంది. ఈ విషయాన్ని నమిత స్వయంగా వెల్లడించింది. ఆదివారం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కోసం తిరుపతి వచ్చింది నమిత. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడింది. తనకు ప్రస్తుతం సినిమాలకంటే రాజకీయాలపైనే ఎక్కువ ఆసక్తి ఉందని..
అందుకే.. తాను పాలిటిక్స్ పై ఫోకస్ చేయబోతున్నానని చెప్పుకొచ్చింది. అయితే ఏ పార్టీ తరపున ప్రచారం చేస్తుందో మాత్రం వెల్లడించలేదు. నమితకు పెళ్లయి, ఇద్దరు పిల్లలు. ఆ పిల్లలు ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. వాళ్లకు నయం అయితే.. తిరుమల వస్తానని నయన మొక్కుకుందట. ఆ మొక్కు తీర్చుకోవడానికి తిరుపతి వచ్చింది. తమిళనాడు రాజకీయాల్లో సినీ తారల పాత్ర కీలకమైనదే. ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. అక్కడ సినీ గ్లామర్ కనిపిస్తుంటుంది. నమితకు పార్టీలు సీటు ఇస్తాయో లేదో తెలీదు గానీ..ఈసారి ఎన్నికల ప్రచారంలో మాత్రం నమితన చూడొచ్చు..!!