తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు హీరోల భార్యలు. ఇక వారు ధరించే దుస్తులు వాచీలు, బ్యాగులు, ఇతరత్రా వస్తువులు కూడా పలు బ్రాండెడ్ గా ఉంటాయని చెప్పవచ్చు. అలా ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డికి ప్రత్యేకమైన క్రేజ్ ఉందని చెప్పవచ్చు. బన్నీ భార్యకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా స్నేహ రెడ్డి ధరించిన చీర ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి..అయితే ఇదంతా ఇలా ఉండగా స్నేహ రెడ్డి ధరించిన ఆ చీర ఖరీదు ఎంత అని నెటిజన్లు నెట్లో సర్చింగ్ చేయగా ఆ చీర ఖరీదు తెలిసి ఒకసారిగా షాక్ అయ్యారు.
ఆ చీర ధర అక్షరాల రూ.1,69,900 రూపాయలు కావడం గమనార్హం. ఇక ఈ చీరలో స్నేహ మరింత అందంగా కనిపిస్తున్నారని అభిమానులు, నెటిజనులు సైతం కామెంట్లు చేస్తూ ఉన్నారు. స్నేహ రెడ్డి ఇద్దరు పిల్లలు తల్లి అయినప్పటికీ కూడా గ్లామర్ విషయంలో హీరోయిన్లకు తీసిపోని విధంగా ఉందని కామెంట్ చేస్తూ ఉన్నారు. ప్రముఖ డిజైనర్లలో ఒకరైన రిమ్జిమ్ దాదు ఈ చీరను రూపొందించినట్లు సమాచారం. అయితే ఈ చీరను మెటాలిక్ కార్డ్స్ తో ఈ చీరను తయారు చేయడం జరిగింది. అందుచేతనే ఈ చీర అంతా ఖరీదైనదిగా నెటిజన్లు సైతం భావిస్తూ ఉన్నారు..!!