in

rashmi gautham: tv artists wont become a prominent name in cinemas

ష్మీ..పరిచయం అక్కర్లేని పేరు..హాట్ యాంకర్ గ మంచి గుర్తింపు తెచ్చుకున్న కొద్దీ మందిలో ఒకరు ఈ క్యూట్ బేబీ..జబర్దస్త్ తో పాటు ఇతర ప్రోగ్రాంలు కూడా చేస్తూ బిజీ అయిపోయింది. టీవీ చానెల్ కార్యక్రమాల్లో పాల్గొంటూనే సినిమాల్లోనూ నటించింది రష్మీ. ‘గుంటూరు టాకీస్’ సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్న రష్మీ. తర్వాత వరుస అవకాశాలు రావడంతో అటు టీవీ, ఇటు సినిమాల్లోనూ బిజీ అయిపోయింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మీ సినిమా ఇండస్ట్రీ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. టీవీలో నుంచి వచ్చిన ఆర్టిస్ట్ ల సినిమాలు అంతగా ఆదరణ పొందవు అని చెప్పింది. టీవీ ఇండస్ట్రీ నుంచి వచ్చి సినిమాల్లో నటిస్తోన్న వారిపై ఒక దురాభిప్రాయం ఉంటుందని..

రోజూ టీవీలో చూసేవాళ్లే కదా వీళ్ళ సినిమాలు ఏం చూస్తాంలే అని అనుకునే అవకాశం ఉందని పేర్కొంది. కొద్ది మంది మాత్రమే టీవీ రంగం నుంచి సినిమాల్లోకి వెళ్లి సక్సెస్ అవుతారని రష్మీ తెలిపింది. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఈ అపోహ ఎక్కువగా ఉంటుందని, తాను కూడా అలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది రష్మీ. తనకి నటించడం అంటే ఇష్టమని, అందుకే ఇప్పటి వరకూ ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నానని, ఇకపై కూడా నటిస్తానని చెప్పింది. సినిమా మీద ఉన్న ఇష్టం తోనే ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఉన్నానని పేర్కొంది. రష్మీ నటించిన సినిమా ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది..!!

balayya To Join Hands With bheeshma director Venky Kudumula?

THE DIFFERENCE BETWEEN REAL HERO AND REEL HERO!