తాజాగా జాన్వీ కపూర్ మరోసారి విజయ్‌తో డేటింగ్, పెళ్లి గురించి స్పందించింది. తన లేటెస్ట్ మూవీ మిలీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న జాన్వీ.. బాలీవుడ్ బబుల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో తాను స్వయంవరం చేసుకోవాల్సి వస్తే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఏ ముగ్గురు నటులను ఎన్నుకుంటావని అడిగారు. దీనిపై స్పందించిన జాన్వీ..ప్రస్తుతం తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని చెప్పింది. ఒకవేళ తాను స్వయంవరం చేసుకోవాల్సి వస్తే హృతిక్ రోషన్, రణ్‌బీర్ కపూర్, టైగర్‌లను ఎంచుకుంటానని చెప్పడం విశేషం. అయితే అప్పుడే ఆమెకు రణ్‌బీర్ కపూర్‌కు పెళ్లయిపోయిన విషయం గుర్తుకు వచ్చింది.
అంతేకాదు హృతిక్‌కు కూడా అయిపోయింది కదా అనుకొని.. ఇంకా పెళ్లి కాని వాళ్లు ఎవరున్నారు అని ఆలోచించింది. అదే సమయంలో విజయ్ దేవరకొండ గురించి ఇంటర్వ్యూలో అడిగారు. ఆ సమయంలో అతనికి దాదాపుగా పెళ్లయిపోయింది అని చెప్పడం విశేషం. జాన్వీ ఎందుకలా చెప్పిందన్న విషయం ఫ్యాన్స్‌కు అంతుబట్టడం లేదు. రష్మిక తో విజయ్ డేటింగ్‌లో ఉన్నాడని చాలాకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలుసు కదా. ఆమె కూడా అదే ఉద్దేశంతో అలా చెప్పిందా అని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు..!!