in

Ravi Teja’s ‘Eagle’ is Hollywood’s john wick Remake?

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని ఇప్పుడు మెగాఫోన్ పట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. రవితేజ హీరోగా ఓ సినిమా తెరకెక్కించబోతున్నారు. దీనికి ‘ఈగల్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి హీరోయిన్ దొరకడం లేదట. అనుపమ పరమేశ్వరన్, కృతిశెట్టి, ప్రియా వారియర్, రీతూవర్మ.. అలానే మరో ఇద్దరు హీరోయిన్లను సంప్రదించారు. కానీ ఎవరూ ఫైనల్ కాలేదని తెలుస్తోంది. రోల్ నచ్చక కొంతమంది.. డేట్స్ సర్దుబాటు చేయలేక మరికొంతమంది సినిమాను అంగీకరించలేదు. సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా దాదాపు పూర్తయింది. సినిమా మొదలుపెట్టడమే ఆలస్యం కానీ హీరోయిన్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి కలుగుతోంది.

ఇదిలా ఉండగా..ఈ సినిమా ఓ హాలీవుడ్ సినిమాకి ఫ్రీమేక్ అని టాక్. హాలీవుడ్ లో ‘జాన్ విక్’ సినిమాలు ఎంత పాపులరో తెలిసిందే. 2014లో వచ్చిన ‘జాన్ విక్’ కథను అడాప్ట్ చేసుకొని రవితేజతో తీయాలనుకుంటున్నారు కార్తిక్ ఘట్టమనేని. ‘జాన్ విక్’ సినిమాలకు సంబంధించి రీమేక్ రైట్స్ అమ్మే ఛాన్స్ లేదు. కాబట్టి రవితేజ సినిమా ఫ్రీమేక్ అనే చెప్పుకోవాలి. తెలుగుకి తగ్గట్లు కథలో మార్పులు, చేర్పులు చేసి.. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించాలనేది దర్శకుడి ప్లాన్. దర్శకుడు రెడీ చేసుకున్న ఎడాప్షన్ స్టోరీ రవితేజకి నచ్చడంతో ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు..!!

Rakul Preet Singh’s response to having Gay Son causes Anger!

bollywood beauty Urvashi Rautela’s special item song for RAPO’s next!