తెలుగు బుల్లితెరపై యాంకర్ అనసూయ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు.జబర్దస్త్ షో తో హాట్ గ్లామరస్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ బ్యూటీ. అయితే ప్రస్తుతం ఆమె యాంకరింగ్ కు గుడ్ బై చెప్పనుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అనసూయ ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు. ఇక బుల్లితెరపై కనిపించరా అని వర్రీ అవుతున్నారు. న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ తర్వాత జబర్దస్త్ లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చారు.
ఈ షో విపరీతమైన క్రేజ్ తెచ్చుకోవడంతో అనసూయకు కూడా ఫుల్ క్రేజ్ వచ్చేసింది. దీంతో ఆమె లైఫ్ మారిపోయింది. కొన్నాళ్ళు జబర్దస్త్ లో చేసిన తర్వాత నెమ్మదిగా సినిమాల్లో కూడా నటించడం మొదలుపెట్టారు. చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ అటు యాంకరింగ్, ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. హీరో నాగార్జున చేసిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో నటించి గ్లామరస్ యాక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అనసూయ. మరోవైపు అనసూయ సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తున్నారు. ఇటీవల ఆమెను ఆంటీ అని పిలిస్తే ఏకంగా కేసులు పెడతానని బెదిరించడం తెలిసే ఉంటుంది.
దీంతో అనసూయను చాలామంది దారుణంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం అనసూయ అవేవీ పట్టించుకోకుండా సినిమా అవకాశాలపైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనసూయ బుల్లితెర షో లకు దూరంగా ఉన్న అనసూయ అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నారు. యాంకర్ గా కొత్త ప్రోగ్రామ్స్ కూడా ఏమీ అనౌన్స్ చేయలేదు. సినిమాల్లో భారీగా అవకాశాలు రావడం వల్లే ఆమెకు టీవీ షోలకు సమయం కేటాయించలేకపోతున్నట్లు తెలిసింది. తన స్థానంలో చెల్లిని యాంకర్‌గా దింపే ప్రయత్నాలు కూడా చేస్తోందనే వార్తలు వస్తున్నాయి. మరి, దీనిపై అనసూయ ఎలా స్పందిస్తారో చూడాలి..!!