in

Allu Aravind reveals his plan of making multistarrer ‘Charan-Arjun’!

ప్పటికే నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్లు , బ్లాక్ బస్టర్లు , ఇండస్ట్రీ హిట్లు చూసిన అల్లు అరవింద్ తాజాగా తన మనసులో ఉన్న డ్రీం ప్రాజెక్ట్ ను బయట పెట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ , అల్లు అర్జున్ లతో గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా తీయాలని ఉందని చెప్పారు. పదేళ్ళ క్రితం ‘చరణ్ -అర్జున్’ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేసి ఇప్పటికీ రెన్యువల్ చేయిస్తున్నానని తెలిపాడు. రామ్ చరణ్ – అల్లు అర్జున్ కలిసి ‘ఎవడు’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాను దిల్ రాజు నిర్మించాడు. ఆ ప్రాజెక్ట్ లో అల్లు అర్జున్ ఉన్నప్పటికీ ఆయన పాత్ర తక్కువే. ఎప్పటికైనా బన్నీ -చరణ్ లతో ఓ సినిమా నిర్మించి పెద్ద హిట్ కొట్టాలని చూస్తున్నారాయణ.

ఇక బన్నీ ఎదుగుదల చూసి ఎంతో గర్వంగా ఉందని పుష్ప తర్వాత నేషనల్ స్టార్ గా ఎదగడం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం తండ్రిగా తనను మరో మెట్టు ఎక్కించాడని అన్నారు. ఇదే ఇంటర్వ్యూ మూడేళ్ళుగా రామాయణం తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని , దానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఏడాదిన్నర గా జరుగుతుందని ఇంకా ఆరు నెలలు ఆ వర్క్ కంటిన్యూ అవ్వనుందని అన్నారు. వచ్చే ఏడాది ప్రొడక్షన్ లోకి వెళ్తుంది. అది చాలా పెద్ద ప్రయత్నం. అది పూర్తయ్యే సరికి ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ అండ్ కాస్ట్లీ ఫిలిం అవుతుంది. అయితే ఈ బిగ్ ప్రాజెక్ట్ గురించి ఇంతకంటే ఇంకా ఏమి చెప్పలేనని ఆయన చెప్పుకున్నారు..!!

apple beauty Hansika Motwani to have a royal wedding!

WHO IS BEHIND THE NAME “GEETHA ARTS”!